Spicejet: భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. విమానం కాక్‌పిట్‌లో కజ్జికాయలు తిన్న పైలట్లు!

  • హోలీ సందర్భంగా స్పైస్‌‌జెట్‌ విమానంలో వెలుగు చూసిన ఘటన
  • పైలట్లపై స్పైస్‌జెట్ యాజమాన్యం సీరియస్
  • బాధ్యులైన పైలట్లను పక్కనపెట్టిన సంస్థ
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభం
Spicejet grounds 2 pilots for having gujiya beverages in flight cockpit on Holi

విమానం కాక్‌పిట్‌లో కజ్జికాయలు తిన్న ఇద్దరు పైలట్లను స్పైస్‌జెట్ యాజమాన్యం విధులకు దూరం చేసింది. హోలీ సందర్భంగా ఆ ఇద్దరు పైలట్లు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ కాక్‌పిట్‌లో కూల్‌డ్రింక్‌ గ్లాసులు తీసుకెళ్లారని, స్వీట్లు తిన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి గువహటీకి వెళ్లే విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పైలట్లపై సీరియస్‌ అయిన యాజమాన్యం వారిని రోస్టర్ నుంచి తొలగిస్తూ విధులకు దూరం చేసింది. పైలట్లపై దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. ఈ ఘటనపై స్పైస్ జెట్‌ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్పందించారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News