North Korea: తగ్గేదేలే.. మరోసారి బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించిన ఉత్తర కొరియా

  • రోజుల వ్యవధిలో మూడోసారి క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా
  • 14వ తేదీన రెండు క్షిపణి పరీక్షలను నిర్వహించిన వైనం
  • క్షిపణి ప్రయోగాన్ని ధ్రువీకరించిన జపాన్
North Korea tests Ballistic Missile

ఇతర దేశాల హెచ్చరికలు, ఆందోళనలను లెక్క చేయకుండా ఉత్తర కొరియా మరోసారి దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. రోజుల వ్యవధిలో కొరియా అణు క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి. ప్యాంగాంగ్ లోని సునాన్ ప్రాతంలో దీన్ని ప్రయోగించారని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. క్షిపణి ప్రయోగాన్ని జపాన్ కూడా ధ్రువీకరించింది. కొరియన్ పీఠభూమికి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ అవతల మిస్సైల్ పడి ఉండొచ్చని తెలిపింది. ఈ నెల 14న కూడా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ క్షిపణులను తూర్పు తీర జలాల్లోకి ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ అధ్యక్షులు సమావేశం కానున్న తరుణంతో ఉత్తర కొరియా ఈ ప్రయోగాలను చేపట్టడం గమనార్హం.

More Telugu News