Bhadradri Ramaiah: భద్రాద్రి భక్తులకు టీఎస్ ఆర్టీసీ సరికొత్త ఆఫర్.. రూ. 116 చెల్లిస్తే సీతారాముల కల్యాణ తలంబ్రాల డోర్ డెలివరీ

TSRTC Offer Lord Rama Kalyana Talambralu door delivery
  • కల్యాణ తలంబ్రాల బుకింగ్ సేవలను ప్రారంభించిన ఆర్టీసీ
  • తొలి బుకింగ్ చేసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • గతేడాది 89 వేల మందికి తలంబ్రాలు అందించామన్న ఆర్టీసీ ఎండీ

భద్రాద్రి రామయ్య భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరిన వారికి ఇంటికే డోర్ డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. అయితే, ఇందుకోసం రూ. 116 చెల్లించాల్సి ఉంటుంది. కావాల్సిన వారు ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఆ మొత్తం చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నిన్న కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. అంతేకాదు, రూ. 116 చెల్లించి బుకింగ్‌ను ప్రారంభించారు. గతేడాది కూడా 89 వేల మందికి స్వామి వారి కల్యాణ తలంబ్రాలను అందించినట్టు తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునేవారు ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగాన్ని 91776 83134, 73829 24900, 91546 80020 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

  • Loading...

More Telugu News