Kiran Abbavaram: 'ఆహా'లో 'వినరో భాగ్యము విష్ణు కథ' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ'
  • తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • 'ఉగాది' కానుకగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమా 
  • ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్
Vinaro Bhagyamu Vishnu katha  will release on March 22nd

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మంచి సక్సెస్ ను సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మురళీ కిశోర్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను రాబట్టింది. 

అలాంటి ఈ సినిమా 'ఆహా' ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. కశ్మీర పరదేశి కథానాయికగా నటించిన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.

మురళీశర్మ కామెడీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. అటు యూత్ .. ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అందువలన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News