DK Shivakumar: డీజీపీని అరెస్ట్ చేయాలి: డీకే శివకుమార్

DK Shivakumar demands to arrest DGP
  • కర్ణాటక డీజీపీ యూజ్ లెస్ అన్న డీకే శివకుమార్
  • ఆయనను ఎన్నికల కమిషన్ తొలగించాలని వ్యాఖ్య
  • కాంగ్రెస్ నేతలపై 25కి పైగా కేసులు పెట్టారని మండిపాటు
కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ను అరెస్ట్ చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు డీజీపీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

'ఈ డీజీపీ యూజ్ లెస్. తక్షణమే కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేయాలి. ఎన్నికల కమిషన్ ఆయనను తొలగించాలి. మూడేళ్ల సర్వీసును ఆయన పూర్తి చేసుకున్నారు. ఇంకెన్నేళ్లు ఆయనను డీజీపీగా కొనసాగిస్తారు? కేవలం కాంగ్రెస్ నేతలపై మాత్రమే ఆయన కేసులు పెడుతున్నారు. మాపై ఆయన 25కి పైగా కేసులు నమోదు చేశారు' అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డీజీపీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మరోవైపు త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం 150 సీట్లను గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది.
DK Shivakumar
Congress
DGP

More Telugu News