AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో రూ. 70 కోట్లు దారి మళ్లినట్టు గుర్తించిన ఈడీ

  • స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ కు నిధులు మళ్లాయన్న ఈడీ
  • డిజైన్ టెక్ నుంచి పలు షెల్ కంపెనీలకు వెళ్లినట్టు గుర్తింపు
  • ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగా నిందితుల విచారణ
ED detects diversion of 70 cr in AP skill development scam

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో 70 కోట్ల నిధులు దారి మళ్లాయని ఈడీ తెలిపింది. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మెటీరియల్, సర్వీసెస్ సప్లై పేరుతో ఈ నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ కు, అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని చెప్పింది. సీమెన్స్ ప్రాజెక్ట్ కు ఇవ్వాల్సిన నిధులను తరలించారని తెలిపింది.

ఈ కేసులో సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా మాజీ ఫైనాన్సియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టర్డ్ అకౌంటెంట్ సురేశ్ గోయల్ లను మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేశామని తెలిపింది. వీరిని విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ కోర్టు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.

More Telugu News