విరాట్ కోహ్లీ డ్యాన్స్ చూశారా..?
- నార్వే బృందం క్విక్ స్టైల్ తో కలసి ప్రత్యేక డాన్స్
- ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన పెప్పీ డ్యాన్స్ బృందం
- ఫైర్ ఎమోజీలతో స్పందించిన అనుష్క శర్మ
నార్వే డ్యాన్స్ గ్రూప్ ‘క్విక్ స్టైల్’ చేసే ‘పెప్పీ డ్యాన్స్’ కు మంచి ఆదరణ ఉంది. ఇదే బృందం విరాట్ కోహ్లీని కలవడంతో అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. క్విక్ స్టయిల్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో కోహ్లీతో కలసి చేసిన డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. స్టీరియో నేషన్ పాడిన ఇషక్ అనే పాటకు వీరు డ్యాన్స్ చేశారు. ఇప్పటికే 29 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 73 లక్షలకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. కోహ్లీ భార్య అనుష్క శర్మ ఫైర్ ఎమోజీలతో స్పందన వ్యక్తం చేసింది. (డ్యాన్స్ వీడియో కోసం)