Vishwak Sen: 'దాస్ కా ధమ్కీ' అదే రోజున రావడం పక్కానే!

Das Ka Dhamki movie update
  • విష్వక్సేన్ హీరోగా 'దాస్ కా ధమ్కీ'
  • ఆయనతో రెండోసారి జోడీ కట్టిన నివేదా పేతురాజ్ 
  • లియోన్ జేమ్స్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల 
విష్వక్సేన్ మొదటి నుంచి కూడా మాస్ ఇమేజ్ ను పెంచుకునే దిశగానే సినిమాలు చేస్తున్నాడు. అడపా దడపా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలను టచ్ చేస్తూనే, మాస్ పాళ్లు తగ్గకుండా చూసుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'దాస్ కా ధమ్కీ' రెడీ అవుతోంది.

ఈ సినిమాలో విష్వక్సేన్ హీరోగా చేయడమే కాదు .. దర్శక నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. ఈ నెల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయన్నున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ కూడా పూర్తయిందని చెబుతూ, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డౌట్ లేదనే విషయాన్ని విష్వక్సేన్ చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటో వదిలాడు. 

విష్వక్సేన్ జోడీగా నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. 'పాగల్' తరువాత విష్వక్సేన్ - నివేదా పేతురాజ్ కలిసి నటించిన ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి. 
Vishwak Sen
Nivetha Pethuraj
Das Ka Dhamki

More Telugu News