Haryana: అచ్చం ఆ వెబ్ సిరీస్‌లో మాదిరిగా.. కారు వెనక డిక్కీలో కూర్చుని రోడ్డుపైకి నోట్లు వెదజల్లిన యువకులు.. వీడియో ఇదిగో!

  • హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’లోని సీన్‌ను తలపించిన ఘటన
  • నిందితుడిని యూట్యూబర్‌గా గుర్తించిన పోలీసులు
  • వెదజల్లినవి నకిలీ నోట్లుగా గుర్తింపు.. ముగ్గురి అరెస్ట్
 Youtuber Throws fake currency from car in gurugram

ఇద్దరు యువకులు కారులోంచి రోడ్డుపైకి కరెన్సీ నోట్లను విసిరేస్తూ కలకలం సృష్టించారు. ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

పోలీసుల కథనం ప్రకారం.. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో కొందరు యువకులు కారులో వెళ్తూ కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఓ యువకుడు కారు డ్రైవ్ చేస్తుండగా ముఖానికి ముసుగు వేసుకున్న మరో యువకుడు డిక్కీలో కూర్చుని కరెన్సీ నోట్లను రోడ్డుపైకి విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను యూట్యూబర్ జరావర్ సింగ్ కల్సీ అతడి ముగ్గురు స్నేహితులుగా గుర్తించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితుడు జరావర్ సింగ్ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్టు చేశారు. 

షాహిద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ సినిమాలోని సీన్‌ను తలపించేలా వీరు ఈ పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు రోడ్డుపై వెదజల్లినవి నకిలీ నోట్లుగా గుర్తించారు. యూట్యూబర్ అయిన కల్సికి 3.51 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 3.42 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

More Telugu News