Chandrababu: పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ అభ్యర్థి గెలవడం పట్ల చంద్రబాబు హర్షం

Chandrababu congratulates Selvi elected as Port Blair Municipal Chairperson
  • పోర్టుబ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం
  • చైర్ పర్సన్ గా టీడీపీ నేత సెల్వి
  • అభినందనలు తెలిపిన చంద్రబాబు
అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం టీడీపీకి దక్కింది. టీడీపీ మహిళా నేత సెల్వి ఎన్నికల్లో విజయం సాధించి, మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని చేపట్టారు. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. పోర్టు బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీకి చెందిన సెల్వి ఎన్నిక కావడం హర్షణీయం అని తెలిపారు. 

బీజేపీ మద్దతుతో సెల్వి విజయం సాధించారని అన్నారు. సెల్వి నియామకం టీడీపీ-బీజేపీ కూటమిపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆమె తన పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Chandrababu
Selvi
Municipal Chairperson
Port Blair
Andman Nicobar
TDP
BJP

More Telugu News