Nara Lokesh: ఒక్క చాన్స్ అంటే నమ్మారు... ఏం జరిగిందో చూడండి: నారా లోకేశ్

  • లోకేశ్ యువగళానికి రెండ్రోజుల విరామం
  • నేడు మళ్లీ ప్రారంభమైన పాదయాత్ర
  • తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉత్సాహంగా కదిలిన పసుపు దళం
  • అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్ గ్యారంటీ అన్న లోకేశ్
Lokesh 42nd day Padayatra details

రెండ్రోజుల విరామం అనంతరం టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. నేడు లోకేశ్ పాదయాత్రకు 42వ రోజు కాగా, తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. దారిపొడవునా లోకేశ్ కు మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలికారు. అడుగడుగునా యువత, విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

కంటేవారిపల్లి విడిది కేంద్రం నుండి మంగళవారం ప్రారంభమైన యువగళం పాదయాత్ర మొగసాలమర్రి, కుమ్మరపల్లి, ఉలవలవాల్లపల్లి, నాయినబావిపల్లి, గుట్టపాలెం మీదుగా విడిది కేంద్రానికి చేరుకుంది.

లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

  • టమాటా రైతుల్ని జగన్ మోసం చేశారు. కెచప్ గిచప్ ఫ్యాక్టరీలు పెడతానని మోసం చేసారు. కోల్డ్ స్టోరేజ్ లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ జగన్ నిలబెట్టుకోలేదు. 
  • మదనపల్లి టొమాటో మార్కెట్ ని దత్తత తీసుకుంటానని హామీ ఇస్తున్నా. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే టమాటా రైతులు పడుతున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం.
  • డ్రిప్ ఇరిగేషన్ కోసం సబ్సిడీ ఇస్తాం. పెట్టుబడి తగ్గించేలా టొమాటో నారు నుండి పురుగుల మందుల వరకూ నాణ్యత తో పాటు తక్కువ ధరకు అందిస్తాం. టమాటా రైతు కు మద్దతు ధర కల్పిస్తాం.
  • కొండంత హామీలు... చెవిలో పువ్వులు!... ఇదే ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరు.
  • టీడీపీ వచ్చాక చంద్రన్న బీమా రూ.10 లక్షలకు పెంచుతాం. 
  • బీసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు అందజేస్తాం.
  • వడ్డెర్లు, కురబలకు క్వారీలు, పచ్చికబయళ్లు కేటాయిస్తాం
  • ఎన్నికల్లో అక్రమాలను ప్రశ్నిస్తే రాళ్లతో కొడతారా? అధికారంలోకి వచ్చేది మేమే... రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
  • అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం తీసుకొస్తాం. 
  • మా బీసీల జోలికి రావాలంటే భయపడాలి. వేధింపులకు గురైన బీసీ బాధితులకు అయ్యే లీగల్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటాం.
  • చంద్రబాబు ఉన్నప్పుడు యువత ఐటీ వైపు చూస్తే. .జగన్ హయాంలో గంజాయి వైపు చూస్తున్నారు. గంజాయి కేపిటల్ ఏంటని గూగుల్ లో కొడితే ఏపీ అని వస్తోంది.
  • సత్యపాల్ నివేదికతో వాల్మీకిలకు న్యాయం చేస్తాం. వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని కమిటీ వేసింది టీడీపీనే. కానీ ప్రభుత్వం మారింది.. .ఈ జగన్ పట్టించుకోలేదు. జగన్ హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పాడు. 
  • మేం అధికారంలోకి రాగానే సత్యపాల్ కమిటీ నివేదిక ప్రకారం వాల్మీకీలను బీసీల్లో చేర్చాలని కేంద్రానికి పంపుతాం. విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం. 
  • తెలుగుదేశంపార్టీ నాయకులను పెద్ద ఫ్యాక్టరీ. శాసనమండలి, శాసనసభ, లోక్ సభకు ఎంతో మంది బీసీలను పంపింది టీడీపీనే. యాదవులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించింది చంద్రబాబే. తుడా, టీటీడీ చైర్మన్లను యాదవులకే ఇచ్చాం. మన జిల్లాలో యాదవులను ఎమ్మెల్యే చేసిన ఘనత టీడీపీదే. యాదవులు కూడా ఆలోచించాలి. హామీ లిచ్చిన జగన్.. .యాదవులకు ఏం చేశాడు.? యాదవులపై దొంగ కేసులు పెడుతుంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏం చేస్తున్నాడు?
  • 217 జీవోతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల పొట్టగొట్టారు. తరతరాలుగా చేపలు పడుతున్న చెరువులను వైసీపీ నేతలు, వాళ్ల బంధువులకు అప్పగిస్తున్నారు. సబ్సీడీతో బోట్లు, వలలు ఇవ్వడం లేదు. ఫైబర్ పడవులు ఇస్తామని జగన్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు... కానీ ఇవ్వలేదు. మత్స్యకారులను తప్పనిసరిగా మేము ఆదుకుంటాం.
  • ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తామని మాట ఇచ్చి, ఒక్కరికే అమలు చేస్తున్నాడు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా నోరు మెదపడం లేదు. 
  • జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచాడు. ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. 
  • వైసీపీ పాలనలో ధరలు ఆకాశాన్నంటాయి. జగన్ రెడ్డి నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఇంటిపన్ను, చెత్తపన్నుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాడు. రానున్న కాలంలో పీల్చే గాలికి కూడా జగన్ రెడ్డి పన్ను వేసేలా ప్రవర్తిస్తున్నాడు. 
  • టీడీపీ కి చెందిన వారిని వేధించిన వైసీపీ వారిపై 2024లో అధికారంలోకి వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ రద్దు చేసిన రేషన్ దుకాణాలను గతంలో నిర్వహించిన వారికే ఇస్తాం.
  •  అభయహస్తం నిధులను దోచుకున్న ఘనుడు జగన్. జగన్ రెడ్డి పేద డ్వాక్రామహిళల అభయహస్తం డబ్బులు రూ.2,200 కోట్లు దోచుకున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ డబ్బులను రికవరీ చేసి, మీకు అందేలా చూస్తాం. 
  • మద్యంపై జగన్ రెడ్డి రూ.25వేల కోట్లు అప్పులు చేశాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత నీచానికి పాల్పడలేదు. 
  • చంద్రబాబు పాలనలో 130 సంక్షేమ కార్యక్రమాలను పేదవారికోసం అమలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగిన వాడిని నమ్మారు... అతను అధికారంలోకి వచ్చాక 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. 
  • చంద్రబాబు పాలనలో ఏనాడూ ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. కరెంటు ఛార్జీలు పెంచలేదు. 

యువగళం పాదయాత్ర వివరాలు

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 539.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.5 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 43వ రోజు షెడ్యూల్ (15-3-2023)*

*తంబళ్లపల్లి నియోజకవర్గం*

ఉదయం

8.00 – గుట్టపాలెం (నాయనిబావి పంచాయితీ) విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం.

8.45 – గట్టు గ్రామంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

10.30 – కొండకిందపల్లిలో స్థానికులతో మాటామంతీ.

11.15 – బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.15 – బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద భోజన విరామం

1.15 – భోజన విరామ స్థలంలో టమోటా రైతులతో సమావేశం.

సాయంత్రం

3.45 – బి.కొత్తకోటలో స్థానికులతో మాటామంతీ.

4.05 – బి.కొత్తకోట వాసులతో సమావేశం.

5.30 – బి.కొత్తకోట ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రంలో బస.


More Telugu News