Spy: కిమ్ గురించి ఇంటర్నెట్లో వెదికాడు... మరణశిక్షకు గురయ్యాడు!

  • ప్రజలపై నిఘా వేయాలని గూఢచారికి ఆదేశాలు
  • ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు అనుమతి
  • కానీ కిమ్ గురించి వెదికేందుకు ఇంటర్నెట్ వినియోగించిన వైనం
  • ప్రాణాలు కోల్పోయిన గూఢచారి
Spy who used internet to search about Kim was death sentenced

ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన ఓ గూఢచారి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కొరియాలో ప్రజలపై తీవ్ర ఆంక్షలు ఉంటాయని తెలిసిందే. ప్రజలు ప్రభుత్వ ఉత్తర్వులను సక్రమంగా పాటిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకునేందుకు ప్రజలపై నిత్యం గూఢచారులు కన్నేసి ఉంచుతారు. అందుకోసం కిమ్ బ్యూరో-10 నిఘా ఏజెన్సీని కూడా స్థాపించాడు. 

ఈ బ్యూరో ఏజెన్సీలో పనిచేస్తున్న ఓ గూఢచారికి ప్రజలపై నిఘా వేసే విధులు అప్పగించారు. సాధారణంగా ఉత్తర కొరియాలో పౌరులకు ఇంటర్నెట్ సేవలు లభ్యం కావడం చాలా కష్టం. అయితే ఈ ఉద్యోగి గూఢచారి కావడంతో ఇంటర్నెట్ వినియోగానికి అనుమతి లభించింది. కానీ అతడు ప్రజలపై నిఘా వేసేందుకు కాకుండా, దేశాధినేత కిమ్ గురించి వెదికేందుకు ఇంటర్నెట్ ఉపయోగించాడు.

ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో, పాపం ఆ గూఢచారికి మరణశిక్ష విధించి అమలు చేశారు. మరికొందరు అధికారులు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినా, వారిని విధుల నుంచి తప్పించి అంతటితో సరిపెట్టారు. అంత విచిత్రంగానూ, భయానకంగానూ ఉంటుంది కిమ్ నియంతృత్వ పాలన.

More Telugu News