H3N2: హెచ్3ఎన్2 వైరస్ తో దేశంలో మరొకరి మృతి

  • భారత్ లో వ్యాపిస్తున్న హాంకాంగ్ ఫ్లూ
  • వడోదరలో మహిళ మృతి
  • దేశంలో ఇప్పటివరకు ముగ్గురి మృతి
  • మార్చి 5 నాటికి 451 కేసుల నమోదు
Woman dies of H3N2 in Gujarat

భారత్ లో హెచ్3ఎన్2 వైరస్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ వైరస్ తో మరొకరు మృతి చెందారు. గుజరాత్ లో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో మరణించినట్టు నిర్ధారణ అయింది. హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ ను హాంకాంగ్ వైరస్ అని పిలుస్తుంటారు. ఈ తరహా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న మహిళను వడోదర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. హెచ్3ఎన్2 వైరస్ తో దేశంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్టయింది. 

హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు కూడా కరోనాను పోలి ఉన్నట్టు గుర్తించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు ఐసీఎంఆర్, ఐఎంఏ వెల్లడించాయి. కాగా, జనవరి 2 నుంచి భారత్ లో హెచ్3ఎన్2 కేసులు నమోదు చేస్తున్నారు. మార్చి 5 నాటికి దేశవ్యాప్తంగా 451 కేసులు గుర్తించారు.

More Telugu News