Tamannaah: తన అందమైన శిరోజాల రహస్యం చెప్పిన తమన్నా

Tamannaah speaks about her hair
  • అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న తమన్నా
  • తాజాగా లాక్మే ఫ్యాషన్ వ్యాక్ లో ర్యాంప్ వాక్
  • తన జుట్టు అంటే తనకెంతో ఇష్టమని వెల్లడి
  • పెద్దగా కాస్మెటిక్స్ వాడనని వివరణ

అందం, అభినయం కలబోతగా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి తమన్నా. అటు గ్లామర్ పాత్రలు, ఇటు నటనకు అవకాశమున్న పాత్రలు పోషిస్తూ కెరీర్ గ్రాఫ్ ను ముందుకు తీసుకెళుతోంది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ మిల్కీ బ్యూటీ వయ్యారం ఒలకబోసింది. ర్యాంప్ వాక్ చేసి చూపరులను ఆకట్టుకుంది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన అందమైన శిరోజాల రహస్యాన్ని చెప్పింది. తాను జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తానని వెల్లడించింది. తన జుట్టు అంటే తనకెంతో ఇష్టమని, జుట్టుకు చాలా తక్కువస్థాయిలోనే కాస్మెటిక్స్ వాడతానని వివరించింది. అంతేకాదు, దుస్తుల ఎంపికలోనూ జాగ్రత్త పడతానని, సౌకర్యంగా అనిపించే దుస్తులనే ధరిస్తానని తమన్నా తెలిపింది.

  • Loading...

More Telugu News