Rail: రైల్లో అర్ధరాత్రి వివాహితపై టీసీ మూత్ర విసర్జన

Drunk Ticket Checker Pees On Woman On Amritsar Kolkata Train Arrested
షార్ట్స్‌లో చూడండి
అకాల్ తఖ్తత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి రైల్లో ప్రయాణిస్తున్న ఓ వివాహితపై టీసీ మూత్ర విసర్జన చేశాడు. నిందితుడు మున్నా కుమార్ మద్యం మైకంలో మూత్ర విసర్జన చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. బాధితురాలు తన భర్త రాజేశ్ కుమార్‌తో కలిసి అమృత్‌సర్ నుంచి కోలకతా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 

టీసీ చేసిన పనికి మహిళ గట్టిగా అరవడంతో మెలకువ వచ్చిన ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకుని ఛార్‌భాగ్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులకు అప్పగించారు. నిందితుడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విమానంలో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఉదంతాలు మరువకమునుపే రైల్వేలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Go Back to Shorts
Rail

More Telugu News