Balakrishna: ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నారు: బాలకృష్ణ గురించి తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ 

Only Balakrishna is my family says Tarakaratna wife Alekhya Reddy
  • కష్ట, సుఖాల్లో చివరి వరకు అండగా ఉన్నారన్న అలేఖ్య
  • బాలయ్య మాత్రమే మా కుటుంబం అని వ్యాఖ్య
  • తారకరత్న కోసం తల్లిలా పాటలు పాడారంటూ పోస్ట్
నందమూరి తారకరత్న చివరి రోజుల్లో బాలకృష్ణ పడిన తపనను ఎవరూ మర్చిపోలేరు. తారకరత్నను బతికించుకోవడానికి బాలయ్య చేయని ప్రయత్నం లేదు. చివరకు తారకరత్న అందరినీ వదిలి వెళ్లిపోయారు. ఆ విషాదం నుంచి ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇంకా కోలుకోలేకపోతున్నారు. మరోవైపు బాలయ్య గురించి ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. 

'మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి (బాలకృష్ణ). కష్ట, సుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీ కోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం... ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబు (తారకరత్న) నీవు తొందరగా వెల్లిపోయావు. మిస్ యూ సోమచ్' అని అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

మార్ఫింగ్ ఫొటోను ఎవరు పెట్టారో కానీ... వారికి థ్యాంక్స్ చెపుతున్నానని అలేఖ్య అన్నారు. చాలా అందంగా ఎడిట్ చేశారని చెప్పారు. ఫొటో విషయానికి వస్తే... తమ పిల్లలను బాలయ్య ఎత్తుకున్న ఫొటోలో పక్కన తారకరత్న కూర్చున్నట్టు ఎవరో మార్ఫింగ్ చేశారు. ఫొటోను ఎడిట్ చేసిన వారికి ఆమె థ్యాంక్స్ చెప్పారు. 
Balakrishna
Tarakaratna
Alekhya Reddy

More Telugu News