Biryani ATM: వేడివేడి బిర్యానీ ఏటీఎం.. ఎక్కడంటే!

  • చెన్నైలోని కొలత్తూర్ లో బిర్యానీ ఏటీఎం
  • బీవీకే బిర్యానీ వినూత్న ఆలోచన
  • అచ్చంగా ఏటీఎంను పోలిన వ్యవస్థ ఏర్పాటు
  • టచ్ స్క్రీన్ పై కావాల్సిన బిర్యానీని ఎంచుకునే వీలు
  • నిమిషాల వ్యవధిలో వేడివేడి బిర్యానీ అందుకోవచ్చంటున్న కంపెనీ 
Biryani ATM in Chennai lets customers take fresh biryani home in minutes

బ్యాంకు ఖాతాలోని డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్తుంటాం.. దుబాయ్ లాంటి దేశాల్లో బంగారం కొనుక్కోవడానికీ ఏటీఎంలు ఉన్నాయి. కానీ నోరూరించే బిర్యానీని అందించే ఏటీఎంలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకొచ్చింది. సిటీలోని కొలత్తూర్ లో ఈ బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించింది. బాయ్ వీటు కల్యాణం (బీవీకే) బిర్యానీ పాయింట్ దేశంలోనే తొలిసారిగా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. వీడియో ఇదిగో!

ఈ బిర్యానీ ఏటీఎంలు ఎలా పనిచేస్తాయంటే..
సాధారణ ఏటీఎంల లోపల ఎలా ఉంటుందో ఈ బిర్యానీ ఏటీఎం కూడా అలాగే ఉంటుంది. మెషిన్ లోని మెనూలో నుంచి కావాల్సిన బిర్యానీని టచ్ స్క్రీన్ పై ఎంచుకుని, పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆపై  బిర్యానీ ధరను కార్డు లేదా యూపీఐ స్కానర్ ద్వారా చెల్లించాలి. డబ్బు చెల్లించాక స్క్రీన్ పై కౌంట్ డౌన్ టైమర్ ఆన్ అవుతుంది. వేడి వేడి బిర్యానీ ఇంకెంత సేపట్లో వస్తుందో ఈ టైమర్ ద్వారా తెలుసుకోవచ్చు. నిర్ణీత సమయం పూర్తవగానే ఏటీఎం మెషిన్ కు ఉన్న చిన్న డోర్ ను తెరిచి లోపల ఉన్న బిర్యానీని తీసుకెళ్లిపోవడమే. దీనికి సంబంధించిన వీడియోను బీవీకే బిర్యానీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

More Telugu News