Vijayaramarao: మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయరామారావు
  • చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
  • గతంలో మంత్రిగా పనిచేసిన విజయరామారావు
  • సీబీఐలో డైరెక్టర్ గా పనిచేసిన వైనం
Former minister Vijayaramarao passed away

మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. విజయరామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

విజయరామారావు రాజకీయాల్లోకి రాకముందు సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన 1959 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. సీబీఐ డైరెక్టర్ హోదాలో బాబ్రీ మసీదు కేసు, హవాలా స్కాం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబయి బాంబు పేలుళ్ల కేసుల దర్యాప్తుల్లో పాలుపంచుకున్నారు. 

ఆయన టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ పై పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవిని కూడా అందుకున్నారు. 

2009 ఎన్నికల్లో ఓటమిపాలైన విజయరామారావు... రాష్ట్ర విభజన తర్వాత అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్రియాశీలక రాజకీయాలకు ఆయన చాలాకాలంగా దూరంగా ఉన్నారు.

More Telugu News