Upendra: 'కబ్జ' ఏ రేంజ్ లో ఉంటుందంటే ..!: హీరో ఉపేంద్ర

Kabza movie pre relese press meet
  • ఉపేంద్ర హీరోగా రూపొందిన 'కబ్జ'
  • ముఖ్యమైన పాత్రల్లో సుదీప్, శివరాజ్ కుమార్
  • భారీతనమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్న ఉపేంద్ర 
  • ఈ నెల 17వ తేదీన విడుదలవుతున్న సినిమా 
ఉపేంద్ర చేసిన కన్నడ సినిమాలు చాలా కాలం క్రితమే తెలుగులోకి అనువాదమయ్యాయి. ఇక తెలుగులోను చాలా కాలం క్రితమే ఆయన ఇక్కడ నేరుగా సినిమాలు చేశారు. ఈ మధ్య కాలంలో తెలుగులో ఆయన విలన్ వేషాలతోను బిజీ అయ్యారు. అలాంటి ఉపేంద్ర హీరోగా 'కబ్జ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై ఉపేంద్ర మాట్లాడుతూ .. 'కబ్జ' నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్ .. ట్రైలర్ .. సాంగ్ మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మీ అందరికీ నచ్చేలానే ఉంటుంది" అన్నారు. 

"ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాను ఇంత గ్రాండియర్ గా తీర్చిదిద్దడం కోసమే దర్శకుడు చంద్రు గారు టైమ్ తీసుకున్నారు. గతంలో నేను చేసిన సినిమాలను .. డైలాగులను కూడా మీరంతా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే మరో సినిమాతోను మీ ముందుకు వస్తాను" అంటూ చెప్పుకొచ్చారు. ఉపేంద్ర సరసన శ్రియ నటించగా, శివరాజ్ కుమార్ .. సుదీప్ ముఖ్యమైన పాత్రలను పోషించడం విశేషం" అంటూ చెప్పుకొచ్చారు. 

Upendra
Shriya Saran
Sudeep
Shiivaraj Kumar
Kabza Movie

More Telugu News