Nara Lokesh: ​​రేపటి నుంచి లోకేశ్ పాదయాత్ర మళ్లీ షురూ... షెడ్యూల్ ఇదిగో!

  • ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన యువగళం
  • పాదయాత్రకు రెండ్రోజుల విరామం
  • హైదరాబాద్ వెళ్లిపోయిన లోకేశ్
  • ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
  • లోకేశ్ పాదయాత్ర రేపటి షెడ్యూల్ విడుదల
Lokesh Yuvagalam Padayatra restarts from tomorrow

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు రెండ్రోజులు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేశ్ తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా, ఎన్నికల కోడ్ కారణంగా జిల్లాలో ఉండరాదంటూ అధికారులు లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను గౌరవిస్తూ లోకేశ్ పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, లోకేశ్ యువగళం పాదయాత్ర రేపు పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్ విడుదలైంది. 

యువగళం పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 529.1 కి.మీ.
యువగళం పాదయాత్ర 42వ రోజు షెడ్యూల్ (14-3-2023)
తంబళ్లపల్లి నియోజకవర్గం

ఉదయం
8.00  – కంటేవారిపల్లి (కురబలకోట మండలం) నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – కండ్లమడుగు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
9.20 – హార్స్ లీ హిల్స్ క్రాస్ వద్ద పెద్దమాండ్యం మండల ప్రజలతో భేటీ.
11.00 – మద్దయ్యప్పగారిపల్లి న్యూ మల్బరీ నర్సరీ వద్ద బీసీ సామాజికవర్గీయులతో సమావేశం.
మధ్యాహ్నం
12.00 – న్యూ మల్చరీ నర్సరీ వద్ద భోజన విరామం.
1.00 –  భోజన విరామ స్థలంలో మహిళలతో ముఖాముఖి.
2.30 – మొగసాలమర్రిలో స్థానికులతో మాటామంతీ.
2.50 – కుమ్మరల్లిలో డెయిరీ రైతులతో సమావేశం.
సాయంత్రం
4.00 – నాయనిబావి వద్ద స్థానికులతో భేటీ.
4.40 – నాయనిబావి పంచాయితీ గుట్టపాలెం విడిది కేంద్రంలో బస.

More Telugu News