MLC Elections: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

  • తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
  • చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్
  • ఈ నెల 16న ఓట్ల లెక్కింపు
MLC Elections polling in Telugu states concludes

తెలుగు రాష్ట్రాల్లో నేడు నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 4 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగ్గా.... తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎమ్మెల్సీ ఓట్లను ఈ నెల 16న లెక్కించనున్నారు.

కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 60.88 శాతం పోలింగ్ నమోదైంది. కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 85.24 శాతం పోలింగ్ నమోదైంది.

More Telugu News