Raghu Rama Krishna Raju: విద్యనేర్పిన గురువులే అమ్ముడుపోతే ఎలా?: రఘురామకృష్ణరాజు

YSRCP distributed cash in MLC elections says Raghu Rama Krishna Raju
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయించిందన్న రఘురాజు
  • మహిళా మంత్రి ఆధ్వర్యంలో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చారని ఆరోపణ
  • అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ చెప్పిందని వ్యాఖ్య
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయించిందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. చదువు రాని వారితో కూడా ఓట్లు వేయిస్తున్నారని అన్నారు. మా వాళ్లు దోచుకున్నారని... అందుకే ఓటుకు రూ. 5 వేలు ఇస్తున్నారని చెప్పారు. విశాఖలో ఒక మహిళా మంత్రి ఆధ్వర్యంలో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చారని అన్నారు. 

విద్య నేర్పే గురువులు కూడా అమ్ముడుపోవడం దురదృష్టకరమని చెప్పారు. తమ ప్రభుత్వం సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని... అలాంటప్పుడు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఎలాగని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపిందని... ఒకవేళ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తే... ఈ కేసులో ఇంకా ఎవరు మిగిలారనేది చూడాలని చెప్పారు.
Raghu Rama Krishna Raju
YSRCP
MLC Elections
YS Avinash Reddy

More Telugu News