Ambati Rambabu: పవన్ కల్యాణ్ సోషల్ ఇంజినీరింగ్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందన

Ambati responds to Pawan Kalyan Social Engineering comments
  • నిన్న కాపు సంక్షేమ సేనతో పవన్ సమావేశం
  • ప్రతి చోటా సోషల్ ఇంజినీరింగ్ జరగాలన్న పవన్
  • కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టడమే సోషల్ ఇంజినీరింగ్ అన్న అంబటి
  • పవన్ ను జాతి క్షమించదని వెల్లడి
కాపు సంక్షేమ సేనతో జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం కావడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, ప్రతి చోటా సోషల్ ఇంజినీరింగ్ జరగాలన్నారు. సంఖ్యా బలం ఉన్న కులాల మధ్య ఐక్యత లేకపోతే అధికారం దక్కదని, రాజకీయ బలం లేని కులాలకు రాజ్యాధికారం చేజిక్కించుకోలేవని అభిప్రాయపడ్డారు. 

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకు తాకట్టుపెట్టడమే పవన్ సోషల్ ఇంజినీరింగ్ అనుకుంటున్నాడని విమర్శించారు. అలా చేస్తే పవన్ ను జాతి క్షమించదని అంబటి ట్వీట్ చేశారు.
Ambati Rambabu
Pawan Kalyan
Social Engineering
Kapu
YSRCP
Janasena

More Telugu News