Idians: ఆస్కార్ అవార్డుల్లో ఇండియా ప్రస్థానం.. ఇప్పటి వరకు ఆస్కార్స్ గెలుపొందిన భారతీయులు వీరే!

  • ఈనాటి ఆస్కార్స్ లో భారత్ కు మూడు అవార్డులు
  • నాటునాటు పాటకు అవార్డులు అందుకున్న కీరవాణి, చంద్రబోస్
  • 1983లో తొలి అవార్డు అందుకున్న భాను అతయ్య
Indians who won Oscars sofar

ఆస్కార్ అవార్డ్స్ వేదికపై ఈరోజు మరోసారి ఇండియా సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటునాటు' పాట అవార్డును కైవసం చేసుకోగా... బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పర్స్' అవార్డును గెలుపొందింది. మనకు మూడు ఆస్కార్స్ రావడంతో భారతీయుల ఆనందం అంబరాన్ని అంటుతోంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం మనకు తొలి ఆస్కార్ వచ్చింది.

ఇప్పటి వరకు భారత్ కు చెందిన ఎవరెవరు, ఎప్పుడు ఆస్కార్ అందుకున్నారంటే:
1983 (55వ అకాడెమీ అవార్డ్స్) - భాను అతయ్య - గాంధీ చిత్రం - బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్.
1992 - సత్యజిత్ రే - లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు. 
2009 (81వ అకాడెమీ అవార్డ్స్) - రసూల్ పూకుట్టి - స్లమ్ డాగ్ మిలియనీర్స్ చిత్రం - బెస్ట్ సౌండ్ మిక్సింగ్. 
2009 (81వ అకాడెమీ అవార్డ్స్) - గుల్జార్ - స్లమ్ డాగ్ మిలియనీర్స్ చిత్రం (జై హో పాట) -  బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (లిరిక్స్)
2009 (81వ అకాడెమీ అవార్డ్స్) - ఏఆర్ రెహమాన్ - స్లమ్ డాగ్ మిలియనీర్స్ (జై హో పాట) - బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (మ్యూజిక్).
2023 (95వ అకాడెమీ అవార్డ్స్) - కార్తీకి - ది ఎలిఫెంట్ విస్పర్స్ - బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్).
2023 (95వ అకాడెమీ అవార్డ్స్) - ఎంఎం కీరవాణి - ఆర్ఆర్ఆర్ (నాటునాటు పాట) - బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (మ్యూజిక్)
2023 (95వ అకాడెమీ అవార్డ్స్) - చంద్రబోస్ - ఆర్ఆర్ఆర్ (నాటునాటు పాట) - బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (లిరిక్స్).

More Telugu News