actor: ఆరోగ్యం కోసం నటి ప్రణీత సూచిస్తున్న ఫుడ్స్ ఇవే..!

  • ప్రతి రోజూ ఉదయం బాదం పప్పులు తింటే మంచి ఫలితం
  • ఆకుపచ్చని, తాజా కూరగాయలు తీసుకుంటే కావాల్సినన్ని పోషకాలు
  • తీపి పదార్థాలను చాలా వరకు తగ్గించడం అవసరం
Kannada actor Pranitha Subhash suggests 3 food options to add to your diet

ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉండాలి. ప్రకాశవంతంగా కనిపించే వారిని చూస్తే వీరు ఏం తింటున్నారు? ఆరోగ్య రహస్యం ఏంటి? అనే సందేహాలు వస్తుంటాయి. మరి సినీ నటి ప్రణీతను తాజాగా ఓ మీడియా సంస్థ ఇదే విషయం అడిగినప్పుడు.. ఆరోగ్యంగా ఉండేందుకు మూడు ఆహారాలను సూచించింది.

బాదం(ఆల్మండ్)
వీటిల్లో మంచి పోషకాలు ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం నేను తగినన్ని బాదం పప్పులను తింటాను. వర్కవుట్ (వ్యాయామాలు)కు ముందు, వర్కవుట్ తర్వాత తీసుకునేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి. బాదం గింజలను తిన్నప్పుడు రోజంతా వాటి ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది. శక్తినిస్తాయి. చురుగ్గా ఉంటారు. వీటిల్లో మంచి ప్రొటీన్ ఉంటుంది. కడుపు నిండినట్టు ఉండడంతో అనారోగ్యాన్ని కలుగ జేసే స్నాక్స్ జోలికి వెళ్లకుండా ఉంటాం. పొద్దున్నే లేదంటే వ్యాయామాలకు ముందు లేదా తర్వాత వీటిని తీసుకోవాలి.

ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని తాజా కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. దీనివల్ల చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఆకుపచ్చని కూరగాయల్లో కేలరీలు తక్కువ. వీటివల్ల బరువు పెరగరు. వీటిని బాయిల్ చేసి తినొచ్చు. తాజావి తీసుకుంటే గరిష్ఠ స్థాయిలో పోషకాలు లభిస్తాయి.

షుగర్ పెద్దగా వద్దు
పంచదార వినియోగాన్ని తగ్గించడం ఎంతో మంచిది. టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు వంటి అనారోగ్యాల రిస్క్ ను చక్కెర వినియోగం పెంచుతుంది. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే, తీపి పదార్థాలు, పానీయాలను చాలా వరకు పరిమితం చేసుకోవాలి. తక్కువ చక్కెర ఉండే వాటినే ఎంపిక చేసుకోవాలి. పండ్లు, పెరుగు లేదా యుగర్ట్, కూరగాయలు తీసుకోవచ్చు. తగినంత నీరు తాగుతూ ఒంట్లో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి.

More Telugu News