Errabelli: కేసీఆర్ తర్వాత నేనే.. ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు!

telangana news minister errabelli dayakar rao interesting comments on political seniority
  • 30 ఏళ్ల నుంచి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నానన్న ఎర్రబెల్లి
  • తెలంగాణలో తన అంత సీనియర్‍ లీడర్ ఎవరూ లేరని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పై కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడి
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‍ తర్వాత తానే సీనియర్‍ అని చెప్పుకొచ్చారు. వరుసగా 30 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నానని, తన అంత సీనియర్‍ రాష్ట్రంలో ఎవరూ లేరని తెలిపారు. వరంగల్‍ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 

తాను కసితో రాజకీయాల్లో రాణించినట్లు ఎర్రబెల్లి చెప్పారు. గతంలో ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిగా భావించే ‘సమితి ప్రెసిడెంట్‍’ పదవికి తన తండ్రి పోటీ చేశారని, కాంగ్రెస్‍ పార్టీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరో వర్గంతో తన తండ్రిని ఓడించిందని అన్నారు. అలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో, కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు  తెలిపారు.

తాను టీడీపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్‍ పార్టీని ఓడించినట్లు చెప్పారు. కసి ఉండడం వల్లే తాను ఎన్నికల్లో ఏడుసార్లు గెలిచానని.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా పనిచేశానని తెలిపారు. అప్పట్లో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు ఉండేవని, వాలీబాల్‍, కబడ్డీ, స్విమ్మింగ్‍ ఇలా మొత్తం అన్ని ఆటల్లోనూ తానే ఫస్ట్ ప్రైజ్‍లు గెలుచుకునే వాడినని చెప్పారు.
Errabelli
errabelli dayakar rao
KCR
political seniority
telangana news
Congress
BRS

More Telugu News