Viral Videos: తల్లి జిరాఫీని చూడగానే పారిపోయిన సింహం!.. వీడియో వైరల్

Viral Video Shows Mother Giraffe Saving Its Baby From Lioness
  • నెట్టింట వీడియో వైరల్
  • పిల్ల జిరాఫీని కాపాడుకునేందుకు తల్లి జిరాఫీ దాడి
  • వీడియోపై నెటిజన్ల అసంతృప్తి
సింహంపై జిరాఫీ దాడి యత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. పిల్ల జిరాఫీ ఒంటరిగా ఉందనుకుని ఓ సింహం ఒక్కసారిగా దాడి చేసింది. ఈ క్రమంలో పిల్ల జిరాఫీ పీకపట్టుకోవడంతో అది తల వాల్చేసింది. అయితే..ఆ పక్కనే ఉన్న తల్లి జిరాఫీ ఒక్కసారిగా సింహంపై లంఘించుకోవడంతో బెదిరిపోయిన మృగరాజు అక్కడి నుంచి పారిపోయింది. జిరాఫీ ధాటికి సింహం పారిపోవడం పలువురిని ఆకట్టుకోవడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

తన పిల్లను కాపాకునేందుకు ప్రాణాలకు తెగించిన తల్లి జిరాఫీ నిజంగా గొప్పదంటూ కొందరు కామెంట్ల వరద పారించారు. ‘‘తల్లి ప్రేమ ఇదే అంటూ’’ అంటూ వరుస వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే సింహం దాడిలో తీవ్రంగా గాయపడ్డ పిల్ల జిరాఫీ వాల్చిన తలను ఎత్తకపోవడాన్ని కొందరు గుర్తించారు. అది అప్పటికే మరణం అంచుకు చేరుకుని ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జీవితం అంటే ఇదేనా.. చంపడం లేదా చావడమేనా’’ అంటూ కొందరు నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే.. ప్రకృతి వీడియోల పేరిట ఇలాంటి సున్నితమైన దృశ్యాలను షేర్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీనిపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Viral Videos

More Telugu News