vivek venkataswamy: కవిత లిక్కర్ క్వీన్.. బీజేపీ నేత విమర్శలు

  • 800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేశారన్న వివేక్ వెంకటస్వామి
  • లిక్కర్ పాలసీలో కమీషన్ ను భారీగా పెంచేశారని ఆరోపణ
  • తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని వ్యాఖ్య
bjp leader vivek venkata swamy slams mlc kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కవిత ‘లిక్కర్ క్వీన్’ అని ఆరోపించారు. 800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేశారని విమర్శించారు. లిక్కర్ పాలసీలో భాగంగా 32 రూపాయలుగా ఉన్న కమీషన్ ను 340 రూపాయలకు పెంచారని చెప్పారు. ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమిషన్ రావుని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకంలో రూ.40 వేల కోట్లు మేఘా కృష్ణారెడ్డితో కలిసి కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల బతుకులను ఆగం చేసిన బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

More Telugu News