Shafali Varma: షెఫాలీ సుడిగాలి ఇన్నింగ్స్... ఢిల్లీ అద్భుత విజయం

Shafali Varma flamboyant innings drives Delhi Capitals to beat Gujarat Giants by 10 wickets
  • గుజరాత్ జెయింట్స్ పై 10 వికెట్ల తేడాతో గెలిచిన క్యాపిటల్స్
  • 28 బంతుల్లో 76 పరుగులు చేసిన షెఫాలీ
  • 10 ఫోర్లు, 5 సిక్సర్లతో శివమెత్తిన యువ బ్యాటర్
  • 106 పరుగుల లక్ష్యాన్ని 7.1 ఓవర్లలోనే ఊదిపారేసిన ఢిల్లీ
గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షెఫాలీ వర్మ సుడిగాలిలా విజృంభించింది. 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ షెఫాలీ వర్మ సూపర్ బ్యాటింగ్ తో కేవలం 7.1 ఓవర్లలోనే గెలుపు తీరాలకు చేరింది. షెఫాలీ కేవలం 28 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. షెఫాలీ స్కోరులో 10 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయంటే, ఆమె గుజరాత్ బౌలర్లను ఏ విధంగా ఊచకోత కోసిందో అర్థమవుతుంది. 

మరో ఎండ్ లో కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్) కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అందుకు కారణం కూడా షెఫాలీనే. బుల్లెట్ షాట్లతో చెలరేగిన షెఫాలీ మ్యాచ్ ను సునామీ వేగంతో ముగించింది. గుజరాత్ బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమన్నారు. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రస్తుతం రెండోస్థానంలో ఉంది.
Shafali Varma
Delhi Capitals
Gijarat Giants
WPL

More Telugu News