Nagashourya: హీరోయిన్ గా మాళవిక నాయర్ ను తీసుకోవడానికి కారణమదే: అవసరాల

Phalana Abbayi Phalana Ammayi Pre Release Event
  • అవసరాల నుంచి మరో రొమాంటిక్ లవ్ స్టోరీ
  • నాగశౌర్య జోడీగా మాళవిక నాయర్ 
  • తన ఇమేజ్ కి కారకుడు నాగశౌర్యనే అని చెప్పిన అవసరాల
  • తన ఫేవరేట్ సాంగ్ గురించిన ప్రస్తావన  

అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన కథలు అటు యూత్ కీ .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. ప్రేమకథలను తెరపై అందంగా ఆవిష్కరించే ఆయన, మరో ప్రేమకథా చిత్రంగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'ని రూపొందించాడు. ఈ నెల 17న ఈ సినిమా విడుదలవుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

ఈవెంటులో అవసరాల మాట్లాడుతూ .. "డైరెక్టర్ గా నా జర్నీని మొదలుపెట్టిన దగ్గర నుంచి కల్యాణి మాలిక్ గారితో కాలిసి వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా నుంచి ఇంకా రెండు పాటలను రిలీజ్ చేయవలసి ఉంది. అందులో ఒక పాటను రీమిక్స్ చేశాము. ఈ సినిమాలో నా ఫేవరేట్ సాంగ్ అదే" అన్నారు. 

" నా డైలాగ్స్ .. నా కథలు .. నా దర్శకత్వం బాగుంటాయని చాలామంది అంటూ ఉంటారు. నాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం నాగశౌర్యనే. ఇక ఈ సినిమాలో కళ్లతోనే హావభావాలు పలికించగలిగే కథానాయిక కావాలి .. అందువల్లనే మాళవికను తీసుకోవడం జరిగింది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News