Chiranjeevi: 40 ఏళ్ల 'అభిలాష'ను గురించి యండమూరి ఏమన్నారంటే..!

  • 1983లో ఇదే రోజున విడుదలైన 'అభిలాష'
  • ఈ రోజుతో 40 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా
  • ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్న యండమూరి
  • కమర్షియల్ రైటర్ గా తనకి పేరు తెచ్చిన సినిమా అని వ్యాఖ్య 
yandamuri Interview

చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'అభిలాష' ఒకటి. 1983 మార్చి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. అంటే ఈ సినిమా విడుదలై ఇప్పటికి 40 ఏళ్లు పూర్తయింది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను గురించి తాజాగా యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు. 

'అభిలాష' సినిమాను కేఎస్ రామారావుగారు నిర్మించగా .. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఇద్దరి తోను నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన సంభాషణలను నన్ను రాయమని అన్నారు. ఒక కమర్షియల్ సినిమాకి నేను ఎప్పుడూ రాయలేదని చెప్పాను. దాంతో సత్యానంద్ గారితో రాయించారు" అన్నారు. 

"ఈ సినిమాలో ఉరిశిక్షను రద్దు చేయాలనే ఒక అంశం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమా ఓ ఇంగ్లిష్ సినిమాకి కాపీ అని అప్పట్లో అన్నారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఇళయరాజా గారు అందించిన పాటలను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నాకు కమర్షియల్ రైటర్ గా మంచి పేరు తీసుకొచ్చిన నవల ఏదైనా ఉందంటే అది 'అభిలాష'నే అని చెప్పుకొచ్చారు. 

More Telugu News