Komatireddy Venkat Reddy: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. పోలీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు

bhuvanagiri mp venkat reddy lodged a complaint at the banjarahills police station
  • ఇటీవల చెరుకు సుధాకర్ కొడుకును ఫోన్ లో బెదిరించిన కోమటిరెడ్డి
  • తాజాగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు
  • తన వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ లిస్ట్‌ను పోలీసులకు అందజేసిన కాంగ్రెస్ ఎంపీ
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్‌ను ఫోన్‌లో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నారంటూ ఆయన బెదిరింపులకు గురి చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.

అయితే తాజాగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీసులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశ్రయించడం గమనార్హం. శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. చంపేస్తామని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ పెడుతున్నారని తెలిపారు.

తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తన వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ లిస్ట్‌ను పోలీసులకు అందించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Komatireddy Venkat Reddy
cheruku sudhakar
bhuvanagiri
Congress
banjarahills police station

More Telugu News