Boeing: భారత్‌లో మరో భారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న బోయింగ్

  • ప్యాసెంజర్ విమానాలను ఫ్రైట్ విమానాలుగా మార్చే కేంద్రం ఏర్పాటు 
  • సరకు రవాణా రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా బోయింగ్ అడుగులు
  • భారత్‌లో భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తున్న సంస్థ
Boeing to set up 737 freighter conversion facility in India

ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ప్యాసెంజర్ విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చే కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ రంగంలో భారత్‌తో పాటూ అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ప్రతికూల ఆర్థిక పవనాలు వీస్తున్నప్పటికీ బోయింగ్ భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణకు పూనుకోవడం గమనార్హం. 

భారత్‌లో పెరుగుతున్న ఈ కామర్స్‌ రంగం, స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగం.. సరకు రవాణా రంగం అభివృద్ధికి దోహదపడుతున్నాయని బోయింగ్ సంస్థ భారత విభాగం ప్రెసిడెంట్ సలీల్ గుప్తే పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లల్లో అంతర్జాతీయంగా 1700 ప్రయాణికుల విమానాలను సరకు రవాణా ఫ్లైట్స్‌గా మార్చేందుకు ఆర్డర్స్ వస్తాయని అంచనా వేశారు. ఇందులో 600 ఆర్డర్స్ ఆసియా దేశాల నుంచే రావచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘కాబట్టి.. భవిష్యత్తుల్లో డిమాండ్‌కు తగ్గట్టుగా భారత్‌లో మా సామర్థ్యం పెంచుకునేందుకు నిర్ణయించాం’’ అని ఆయన వివరించారు. 

ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా భారత్.. బోయింగ్ సప్లయ్ చెయిన్‌కు మరింత కీలకంగా మారుతుందని సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మార్క్ అలెన్ మీడియాకు తెలిపారు. అయితే.. ఈ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎంత పెట్టుబడి పెడతారు? అన్న విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇప్పటికే భారత్‌లో 24 మిలియన్ డాలర్ల పెట్టుబడితో బోయింగ్.. విమాన విడిభాగాలకు సంబంధించి లాజిస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News