low sex drive: లైంగిక ఉద్దీపనలు తగ్గడానికి ఇవి కారణాలై ఉండొచ్చు..!

  • ఒత్తిడి, హార్మోన్లలో మార్పులతో తగ్గిపోయే కోర్కెలు
  • భాగస్వామితో విభేదాలు అవరోధాలే
  • జీవనశైలి, పోషకాహారం పాత్ర కీలకం
  • కొన్ని ఔషధాలకు దుష్ప్రభావం కూడా
reasons for low sex drive in men these days and how to treat it

దంపతుల మధ్య అనుబంధం బలంగా ఉంచడంలో శృంగారమూ ముఖ్యమైనదేనని నిపుణులు చెబుతుంటారు. కానీ, నేడు ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు లైంగిక కోర్కెలు పెద్దగా ఉండడం లేదని చెబుుతున్నారు. ఒత్తిడి పెరిగిపోయినా, హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడినా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. సాధారణంగా పురుషుల్లో కామోద్దీపనలు తగ్గడానికి ఒత్తిడి, కుంగుబాటు, మద్యపానం, డ్రగ్స్ వినియోగం, తీవ్ర అలసట కారణాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు కూడా ఉండొచ్చు.

ఒత్తిడి
ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది టెస్టో స్టెరోన్ హార్మోన్ ఉత్పత్తికి విఘాతం కలిగిస్తుంది. దాంతో లైంగిక కోర్కెలు తగ్గుతాయి. ఏదైనా సమస్య లేదా అసాధారణ పరిస్థితి ఎదురైనప్పుడూ లేదంటే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొన్నప్పుడు లైంగిక కోర్కెలు నశిస్తాయి.

హార్మోన్లు
టెస్టోస్టెరోన్ హార్మోన్ చాలా కీలకమైనది. ఇది తగ్గితే లైంగిక కోర్కెలు క్షీణిస్తాయి. హైపోగోనడిజం ఉన్న పురుషులు సైతం తక్కువ టెస్టోస్టెరోన్ తో ఇబ్బంది పడుతుంటారు. తక్కువ అంటే 300 ఎంజీ/డీఎస్ లోపు అని అర్థం.

ఔషధాలు
కొన్నిరకాల ఔషధాలకు దుష్ప్రభావాల కింద లైంగిక కోర్కెలు తగ్గిపోతాయి. డిప్రెషన్, రక్తపోటు తగ్గేందుకు ఇచ్చే మందులు, కీమోథెరపీ తరహా రేడియేషన్ చికిత్సలు, స్టెరాడియల్ చికిత్సలు లైంగిక కోర్కెలను తగ్గించేస్తాయి.

జీవనశైలి అలవాట్లు
సరైన పోషకాలు తీసుకోకపోవడం కూడా ప్రభావం చూపిస్తుంది. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, డ్రగ్స్ అలవాటు కూడా లైంగిక కోర్కెలను నియంత్రిస్తాయి.

విభేదాలు
భాగస్వామితో గొడవలు, సమాచారం అంతరం వంటివి లైంగిక కోర్కెలకు అవరోధంగా నిలుస్తాయి.

పరిష్కారాలు
మంచి పోషకాహారం తీసుకుంటూ, తగినంత నిద్రపోవాలి. శారీరక వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. పొగతాగడం, ఆల్కహాల్ వంటివి మానేయాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి.

More Telugu News