RRR: చంద్రబోస్ ను చేరుకున్న ‘క్రిటిక్స్’ అవార్డులు

RRR lyricist Chandrabose collects his Critics Choice and HCA award
  • హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డు స్వీకరణ
  • ట్విట్టర్లో ప్రకటించిన గేయ రచయిత చంద్రబోస్
  • క్రిటిక్స్ చాయిస్ అవార్డు సైతం స్వీకరణ
ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డులను గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇలా నాలుగు విభాగాల్లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు వరించాయి. గతంలో రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ ఈ అవార్డులను స్వీకరించారు.

ఇప్పుడు నాటునాటు గీత రచయిత చంద్రబోస్ సైతం క్రిటిక్స్ చాయిస్ అవార్డుతోపాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును సైతం స్వీకరించినట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని చంద్రబోస్ ట్విట్టర్ లో ప్రకటించారు. నాటి అవార్డుల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ సైతం వెళ్లలేకపోవడం తెలిసిందే. అయినప్పటికీ, అవార్డులను ఆయనకు పంపిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి బెస్ట్ సాంగ్, బెస్ట్ ఫారీన్ లాంగ్వేజ్ విభాగాల్లో క్రిటిక్స్ చాయిస్ అవార్డులను పొందడం గమనార్హం.



RRR
lyricist
Chandrabose
IPL

More Telugu News