Karnataka: కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హఠాన్మరణం

Karnataka Congress working president R Dhruvanarayana dies after chest pain
  • ఛాతీలో నొప్పితో బాధపడ్డ ధ్రువనారాయణ 
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు 
  • కాపాడలేకపోయిన వైద్యులు
  • కాంగ్రెస్ నేతల సంతాపం
కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఆర్. ధ్రువనారాయణ శనివారం ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉందని చెప్పడంతో, 61 ఏళ్ల ధ్రువనారాయణను మైసూరులోని డీఆర్ఎంఎస్ హాస్పిటల్ కు శనివారం ఉదయం తరలించారు.

‘‘ఆర్.ధ్రువనారాయణ మరణించారు. ఛాతీలో నొప్పి రావడంతో డ్రైవర్ ఉదయం 6.40 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయినప్పటికీ, ఆయన్ను కాపాడలేకపోయాం’’ అని డాక్టర్ మంజునాథ్ ప్రకటించారు.

పలువురు కాంగ్రెస్ నాయకులు ధ్రువనారాయణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ధ్రువనారాయణ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నానంటూ అఖిల భారత కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ కృష్ణ అల్లవరు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
Karnataka
Congress working president ౌ
Dhruvanarayana
dies
haerat attack
chest pain

More Telugu News