సోఫాలో కూర్చోబోయిన ప్రతిసారీ మొరిగిన పెంపుడు కుక్క! యజమానికి అనుమానం వచ్చి చూస్తే..!
- యజమాని ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క
- సోఫాలో కూర్చోబోయిన ప్రతిసారి యజమానిని అడ్డుకున్న కుక్క
- అనుమానం వచ్చి సోఫాను చెక్ చేస్తే కనిపించిన విష సర్పం
నిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్కాంబే అనే వ్యక్తి.. కొన్ని రోజులుగా తన పెంపుడు కుక్క ప్రవర్తనలో మార్పును గమనిస్తున్నాడు. అతడు తన ఇంట్లోని ఓ సోఫాలో కూర్చోబోయిన ప్రతిసారీ కుక్క పెద్ద పెట్టున మొరగడం మొదలెట్టేది. రోజుల తరబడి ఈ వ్యవహారం సాగింది. కుక్క తన యజమానిని సోఫాలో అస్సలు కూర్చోనిచ్చేది కాదు. కుక్క వింత ప్రవర్తనతో ఎస్కాంబేలో అనుమానం మొదలైంది.
దాంతో అతడు సోఫాను జాగ్రత్తగా పరిశీలించగా దాని కింద ఓ భయానక విష సర్పం కనిపించడంతో అతడు ఒక్కసారిగా షాకైపోయాడు. అతడి కంట పడింది బ్లాక్ మంబా అనే పాము. అది కాటేస్తే కేవలం 20 నిమిషాల్లో మరణం సంభవిస్తుంది. ఈ క్రమంలో ఎస్కాంబే పాములు పట్టే వ్యక్తి సాయంతో దాని పీడ వదిలించుకున్నాడు. పెంపుడు కుక్క తనను అప్రమత్తం చేయడంతోనే తన ప్రాణాలు నిలిచాయంటూ అతడు ఊపిరి పీల్చుకున్నాడు.