KTR: రేపు కవితను విచారించనున్న ఈడీ... ఢిల్లీ బయల్దేరిన కేటీఆర్

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత
  • విచారణ నోటీసులు పంపిన ఈడీ
  • కవితను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం
  • కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిన వైనం
KTR goes to Delhi as Kavitha set to attend ED questioning

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ రేపు విచారించనుంది. ఈ నేపథ్యంలో, కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ హుటాహుటీన ఢిల్లీ బయల్దేరారు. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కేటీఆర్ ఢిల్లీ పయనమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు, ముఖ్యనేతలు కూడా ఢిల్లీ బయల్దేరారు. 

లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 9న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే తనకు ఈ నెల 9, 10వ తేదీల్లో కూడా తీరిక లేదని, 11వ తేదీన విచారణకు వస్తానని కవిత ఈడీకి బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె రేపు (మార్చి 11) ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

More Telugu News