Gali Janardhan Reddy: బోనులో ఉన్నా పులి పులే.. నేను వెనకడుగు వేయను: గాలి జనార్దన్ రెడ్డి

I will not go back to BJP says Gali Janardhan Reddy
  • గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం
  • రెడ్డి వస్తారనే నమ్మకం తనకు ఉందనన్న సీఎం బొమ్మై
  • ఇతరులకు షాక్ ఇస్తానన్న జనార్దన్ రెడ్డి
బళ్లారి ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తారనే నమ్మకం తనకు ఉందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా తాజాగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. 

తాను వెనకడుగు వేయనని... పులి బోనులో ఉన్నా పులే అని ఆయన అన్నారు. ఇతరులకు షాక్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విదేశాల్లో తనకు డబ్బు ఉందని చెపుతున్నారని... ఆ సొమ్మును కనిపెట్టేందుకు ఏజెన్సీలకు ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. విదేశాల్లో ఉందని చెపుతున్న డబ్బును తెస్తే... దాన్ని ప్రజలకే పంచి పెడతానని చెప్పారు. తాను స్థాపించిన పార్టీలోకి ఇతర నేతలు చేరకుండా చేసేందుకే తాను బీజేపీలోకి  వస్తున్నాననే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పార్టీతో తాను ముందుకు వెళ్లకుండా లొంగదీసుకోవచ్చని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుందని అన్నారు.
Gali Janardhan Reddy
Karnataka
BJP

More Telugu News