Tulasi Reddy: ఒకే మహిళకు 18 మంది భర్తలట.. జగన్ మాయ ఇది: తులసిరెడ్డి

Tulasi reddy fires on fake votes in MLC elections
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోగస్ ఓట్లను సృష్టిస్తోందన్న తులసిరెడ్డి
  • ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులట అంటూ ఎద్దేవా
  • ఈసీ దృష్టి సారించాలని విన్నపం
ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోగస్ ఓట్లను సృష్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులట... ఒకే మహిళకు 18 మంది భర్తలట... ఇది కాలమహిమా? లేక కలి మాయా? లేక జగన్ మాయనా? అని ఆయన ప్రశ్నించారు. ఇది బోగస్ ఓట్ల నమోదు కోసం జరిగిన జగన్ మాయ అని విమర్శించారు. దొంగ ఓట్లతో, నోట్ల కట్టలతో అప్రజాస్వామిక పద్ధతిలో బరి తెగించి గెలవాలని వైసీపీ భావిస్తోందని మండిపడ్డారు. బోగస్ ఓట్లను సృష్టిస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Tulasi Reddy
Congress
Jagan
YSRCP
MLC elections
Fake Votes

More Telugu News