Srisailam: ఫలించిన సుదీర్ఘ పోరాటం.. శ్రీశైలం దేవాలయానికి 4500 ఎకరాలు బదలాయించేందుకు అటవీశాఖ ఆమోదం

  • గత ఐదు దశాబ్దాలుగా దేవాలయం పోరాటం 
  • పక్కా ఆధారాలతో ఆ భూమి ఆలయానిదే అని నిరూపించిన దేవాదాయశాఖ
  • ఏపీలో రెండో ధనిక దేవాలయంగా ఘనత  
  • సంతోషం వ్యక్తం చేసిన దేవాదాయ మంత్రి కొట్టు
Srisailam temple is second richest in AP

ఏపీలో తిరుమల తర్వాత రెండో ధనిక దేవాలయంగా శ్రీశైలం స్థానాన్ని సంపాదించింది. శ్రీశైలం ఆలయానికి నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4,500 ఎకరాల భూమిని బదలాయించేందుకు అటవీశాఖ అంగీకరించింది. ఆలయానికి సమీపంలో ఉన్న ఈ భూమి కోసం గత ఐదు దశాబ్దాలుగా దేవాదాయ, అటవీశాఖలు పోరాడుతున్నాయి. 

ఈ క్రమంలో ఆ భూమి తమదే అని రుజువు చేసేందుకు దేవాదాయశాఖ చారిత్రక రికార్డులతో పక్కాగా నిరూపించింది. దీంతో అటవీశాఖ భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. 4,500 ఎకరాల భూమిని ఆలయ నిర్వహణలోకి తీసుకురావడం సంతోషంగా ఉందని దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

More Telugu News