Bengaluru: బస్సులో చెలరేగిన మంటలు.. కండక్టర్ సజీవ దహనం

Conductor dies as bus catches fire in bengaluru
  • బెంగళూరులో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం
  • బస్సులో నిద్రిస్తున్న కండక్టర్ సజీవదహనం
  • లింగధీరనహళ్లి బస్‌స్టాండ్‌లో వెలుగు చూసిన ఘటన
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ఓ కండక్టర్ సజీవ దహనమయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని ముత్తయ్య స్వామిగా గుర్తించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ ప్రకాశ్ బస్సును లింగధీరనహళ్లి బస్‌స్టాండ్‌లోని డీ గ్రూప్ స్టాప్‌లో పార్క్ చేసి వెళ్లారు. బస్ స్టేషన్‌లో విశ్రాంతి మందిరంలో డ్రైవర్ నిద్రించగా కండక్టర్ ముత్తయ్య మాత్రం బస్సులోనే నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ రాత్రివేళ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కండక్టర్ అగ్నికీలలకు బలైపోయారు. ముత్తయ్యకు 80 శాతం మేర కాలిన గాయాలయ్యాయని స్థానిక డీసీపీ మీడియాకు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగిన విషయన్ని తొలుత డ్రైవర్ గుర్తించారని పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు.
Bengaluru

More Telugu News