cough syrup: దగ్గు మందు విషంగా ఎలా మారుతుంది?

  • ఎథిలీన్ గ్లైకాల్, డైఎథిలీన్ గ్లైకాల్ విషపూరితం
  • మోతాదు మించి ఉంటే మూత్ర పిండాల వైఫల్యం
  • కొనే ముందు ఇంగ్రేడియంట్స్ ను చూసుకోవాల్సిందే
How cough syrup gets poisoned

మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దగ్గు ఉపశమనం కోసం కాఫ్ సిరప్ ను ఓవర్ ద కౌంటర్ (డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా)  రూపంలో విక్రయిస్తుంటారు. ఇలా జలుబు, దగ్గు కోసం ఓవర్ ద కౌంటర్ విక్రయించే మందుల విలువ ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.

కాఫ్, కోల్డ్ సిరప్ లలో అసిటమెనోఫెన్ తోపాటు, ప్రాపీలేన్ గ్లైకాల్ అనే మందు కూడా ఉంటుంది. ఇది దగ్గు మందును తియ్యగా చేస్తుంది. ఇటీవల గాంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో భారత్ కంపెనీల దగ్గు ముందు తాగి చిన్నారులు పదుల సంఖ్యలో మరణించడం తెలిసిందే. ఈ దగ్గు మందులో ఎథిలీన్ గ్లైకాల్ (ఈజీ), డైఎథిలీన్ గ్లైకాల్(డీఈజీ) ఉన్నాయి. ప్రాపీలేన్ గ్లైకాల్ కు ఉప ఉత్పత్తులు ఇవి.

ఫార్మా కంపెనీలకు స్పెషాలిటీ కెమికల్ కంపెనీలు ప్రాపీలేన్ గ్లైకాల్ ను సరఫరా చేస్తుంటాయి. ఇలా సరఫరా చేసే ముందు దాన్ని ప్యూరిఫై చేసి, ట్యాక్సిన్లు ఉంటే తొలగించాలి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 100 ఎంఎల్ సిరప్ లో ఈజీ, డీఈజీ 0.10 గ్రాములకు మించి ఉండకూడదు. అంతకుమించి ఉంటే అది ప్రాణాంతకం అవుతుంది. ప్రాపీలేన్ గ్లైకాల్ హానికారకం కాదు. కానీ, ఈజీ, డీఈజీ మాత్రం విషపూరితం. మూత్రపిండాల వైఫల్యం, మరణానికి దారితీస్తుంది.

మరి ప్రాపీలైన్ గ్లైకాల్ నే వాడొచ్చుగా..? అన్న ప్రశ్న రావచ్చు. కానీ, ప్రాపీలైన్ గ్లైకాల్ తో పోలిస్తే ఈజీ, డీఈజీ సగం కంటే తక్కువ ధరకు లభిస్తాయి. ప్యారాసెటమాల్ సిరప్ లో డీఈజీ అధిక మోతాదులో ఉండడం వల్ల 1990లో హైతీలో 90 మంది చిన్నారులు మరణించగా, బంగ్లాదేశ్ లోనూ 200 మందికి పైగా చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. తుది ఉత్పత్తులను కచ్చితంగా పరీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కనుక దగ్గు మందు కొనుగోలు చేసే వారు ఇంగ్రేడియంట్స్ లో ఈజీ, డీఈజీ లేకుండా చూసుకోండి.

More Telugu News