Meenakshi Lekhi: సిసోడియా అరెస్ట్ కాబోతున్నారనే విషయం ఆప్ నేతలకు ముందే తెలుసు: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి

  • సిసోడియా లిక్కర్ స్కామ్ లో ఉన్నారనే విషయం ఆప్ నేతలకు తెలుసన్న మీనాక్షి
  • అందుకే సిసోడియాను అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ నేతలు చెప్పారని వ్యాఖ్య
  • పక్కా ఆధారాలు లభించడం వల్లే సిసోడియా అరెస్ట్ అయ్యారన్న మీనాక్షి
AAP leaders know that Sisodia will be arrested says Meenakshi Lekhi

లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియర్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఆయన ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనీశ్ సిసోడియా లిక్కర్ స్కామ్ లో ఉన్నారనే విషయం ఆప్ నాయకులకు ముందే తెలుసని చెప్పారు. అందుకే వారు సిసోడియాను ఈడీ అరెస్ట్ చేస్తుందని ముందుగానే పదేపదే చెప్పారని అన్నారు. 

సిసోడియాను ఈడీ అరెస్ట్ చేస్తుందని సౌరభ్ భరద్వాజ్ తో పాటు పలువురు ఆప్ నేతలు ప్రెస్ కాన్ఫరెన్సుల్లో చెప్పారని... ఎందుకంటే... లిక్కర్ స్కామ్ లో సిసోడియా ఉన్నారనే విషయం వీరికి తెలుసని చెప్పారు. డబ్బులు దేశం వెలుపలకు, బయటి నుంచి మళ్లీ దేశంలోకి ఎక్స్ ఛేంజ్ అయ్యాయని వారికి తెలుసని... ఈ కేసులో త్వరలోనే సిసోడియా అరెస్ట్ అవుతారనే సంగతి కూడా వారికి తెలుసని అన్నారు. 

ఈడీ, సీబీఐ రెండూ వేర్వేరు ఏజెన్సీలు అని... సిసోడియాను ఈ రెండు ఏజెన్సీలు వేర్వేరు ఛార్జెస్ కింద అరెస్ట్ చేశాయని మీనాక్షి చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ అవినీతి గురించి సీబీఐ విచారిస్తుందని... రూ. 100 కోట్ల మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ విచారిస్తుందని తెలిపారు. స్కామ్ కు సంబంధించి కొన్ని పక్కా ఆధారాలు లభించడం వల్లే సిసోడియాను అరెస్ట్ చేశాయని చెప్పారు.

More Telugu News