K Kavitha: కాసేపట్లో కవిత ధర్నా ప్రారంభం.. దీక్షలో కూర్చోనున్న 500 మంది

  • ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష
  • కవిత దీక్షకు 18 పార్టీల మద్దతు
  • ధర్నాను ప్రారంభించనున్న సీతారాం ఏచూరి
Kavitha Deeksha to start by 10 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఆమె దీక్ష చేయనున్నారు. కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. 

ఈ పార్టీల ప్రతినిధులు కవిత దీక్షలో కూర్చోనున్నారు. అంతేకాదు దేశంలోని వివిధ మహిళా హక్కుల సంఘాలు కూడా కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్షను ముగించనున్నారు.

More Telugu News