నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్
- నేపాల్ లో దేశాధ్యక్ష ఎన్నికలు
- నేపాలీ కాంగ్రెస్ నేత పౌడెల్ ఘనవిజయం
- ఎనిమిది పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన పౌడెల్
నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఓట్లు 882. వారిలో 332 మంది పార్లమెంటు సభ్యులు కాగా, 550 మంది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు.
నేపాల్ ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి శాలిగ్రామ్ మాట్లాడుతూ... 518 మంది అసెంబ్లీ సభ్యులు, 313 మంది పార్లమెంటు సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. 2008లో నేపాల్ రిపబ్లిక్ గా అవతరించాక, దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి.