US Consulate General: హైదరాబాదులో మరో చోటికి యూఎస్ కాన్సులేట్ కార్యాలయం తరలింపు

US Consulate General office in Hyderabad will shift to new location
షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదులో ఏర్పాటైన యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మరో చోటికి తరలిపోతోంది. మార్చి 20 నుంచి కొత్త కార్యాలయంలో సేవలు అందించనున్నట్టు యూఎస్ కాన్సులేట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. సర్వే నెం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, హైదరాబాద్, తెలంగాణ-500032... ఇదే తమ కొత్త అడ్రస్ అని వివరించింది. 

ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కార్యాలయం బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో ఉంది. తరలింపు నేపథ్యంలో, ఈ నెల 15 నుంచి 20వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు కాన్సులేట్ సేవలు అందుబాటులో ఉండవని అమెరికా దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.
Go Back to Shorts
US Consulate General
Hyderabad
Nanakramguda
Begumpet

More Telugu News