Ram Charan: హాలీవుడ్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ!.. ప్రాజెక్టుపై చర్చలు

RRR star Ram Charan reveals Hollywood project to be announced soon
  • ఓ హాలీవుడ్ ప్రాజెక్టుపై చర్చించినట్టు వెల్లడించిన చరణ్
  • కొన్ని నెలల్లో దీనిపై ప్రకటన ఉంటుందని వెల్లడి
  • అమెరికాన్ పాడ్ కాస్టర్ శామ్ ఫ్రాగాసోకు తెలిపిన నటుడు
రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో చరణ్ హాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని తనే ఓ విదేశీ టెలివిజన్ తో మాట్లాడిన సందర్భంగా వెల్లడించాడు. పాడ్ కాస్టర్ శామ్ ఫ్రాగాసోతో ఇటీవలే రామ్ చరణ్ ముచ్చటించాడు. తాను ఓ హాలీవుడ్ ప్రాజెక్టు కోసం చర్చించినట్టు ఈ సందర్భంగా వెల్లడించాడు. 

అయితే, తాను అమెరికాలో హాలీవుడ్ సినమా సెట్ లోకి ఎప్పుడు అడుగు పెట్టేది కొన్ని నెలల్లో ప్రకటన చేస్తానని తెలిపాడు. జూలియా రాబర్ట్స్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ తో కలసి పనిచేయాలని అనుకుంటున్నట్టు చరణ్ తన ఆకాంక్షను బయటపెట్టాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ కావడంపై స్పందిస్తూ.. ఇది కేవలం ఒక్కసారికే పరిమితం కాకూడదని, రానున్న రోజుల్లో తమకు ఇది సాధారణంగా మారుతుందన్న ఆశాభావాన్ని రామ్ చరణ్ వ్యక్తం చేశాడు. మరోవైపు దిల్ రాజుతో కలసి చరణ్ చేసే ఆర్ సీ 15 సినిమా టైటిల్ పై చరణ్ పుట్టిన రోజు అయిన మార్చి 27న ప్రకటన వెలువడనుంది.
Ram Charan
RRR star
Hollywood
entry
discussions

More Telugu News