Manish Sisodia: జైల్లో సిసోడియాను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఆప్ ఆరోపణలపై తీహార్ జైలు అధికారుల స్పందన

  • తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా
  • సిసోడియా ఉన్న సెల్ లో క్రిమినల్స్, మర్డరర్స్ ఉన్నారన్న ఆప్
  • సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు మాత్రమే ఉన్నారన్న జైలు అధికారులు
Tihar Jail officials response on Sisodias security

లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు జైల్లోని సెల్ లో కరడుగట్టిన క్రిమినల్స్, హత్యలు చేసినవారు ఉన్నారని... సిసోడియాను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. 

ఈ ఆరోపణలపై తీహార్ జైల్లోని ప్రిజనర్స్ డిపార్ట్ మెంట్ అధికారులు స్పందిస్తూ... సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయనను ప్రత్యేకమైన వార్డులో ఉంచామని చెప్పారు. సీజే-1 వార్డులో ఆయనను ఉంచామని... ఆ వార్డులో అతి తక్కువ మంది ఖైదీలు మాత్రమే ఉంటారని, వారిలో గ్యాంగ్ స్టర్స్ లాంటి వాళ్లు ఎవరూ ఉండరని చెప్పారు. ఆ వార్డులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తన కలిగిన వారని తెలిపారు. జైలు నిబంధన ప్రకారం సిసోడియాకు పూర్తి భద్రతను కల్పించామని చెప్పారు.

More Telugu News