Rajamouli: 'నాటు నాటు' పాటను ఉక్రెయిన్ లో ఎందుకు తీశామంటే...: రాజమౌళి వివరణ

  • ఇండియాలోనే పాటను చిత్రీకరించాలనుకున్నామన్న రాజమౌళి
  • వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇతర లొకేషన్లను సెర్చ్ చేశామని వెల్లడి
  • కీవ్ లోని ప్రెసిడెన్సియల్ ప్యాలెస్ కరెక్ట్ అనిపించిందన్న దర్శకదిగ్గజం
Rajamouli reviles why Natu Natu song shot in Ukraine

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాట ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతోంది. మరోవైపు ఈ పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ పాట గురించి తాజాగా వ్యానిటీ ఫెయిర్ అనే మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 

తొలుత ఈ పాటను ఇండియాలోనే చిత్రీకరిద్దామని అనుకున్నామని... అయితే వర్షాకాలం ప్రారంభం కావడంతో... ఇతర లొకేషన్ల గురించి ఆలోచించడం ప్రారంభించామని చెప్పారు. చివరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ప్రెసిడెన్సియల్ ప్యాలస్ ను ఎంచుకున్నామని తెలిపారు. 

ఈ ప్రదేశమే నాటు నాటు పాటకు బెస్ట్ అని తనకు అనిపించిందని రాజమౌళి చెప్పారు. ప్యాలస్ కలర్, సైజ్, గ్రౌండ్ అన్నీ పాటకు సరిగ్గా సరిపోయాయని అన్నారు. పాట చిత్రీకరణ సమయంలో ఉక్రెయిన్ టీమ్ ఎంతో సహకరించిందని చెప్పారు. మరోవైపు గత రెండు దశాబ్దాల కాలంలో ఆస్కార్ కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈనెల 12న లాస్ ఏంజెలెస్ లో జరిగే ఆస్కార్స్ సెరమొనీలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు ఈ పాటను పర్ఫామ్ చేయనున్నారు.

More Telugu News